
భరించలేని తలనొప్పితో బాధపడే వారు రకరకాల అయింట్‌మెంట్లూ, టాబ్లెట్లూ, ఇంజెక్షన్లనూ వాడుతున్నారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పరికరం రానున్నదట. ఎలక్ట్రిక్ షేవర్‌లా కనిపించే ఈ పరికరం బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ పరికరాన్ని మెడమీద కేవలం 90 సెకన్లు ఉంచుకుంటే చాలు పార్శ్వపు నొప్పి తీవ్రత తగ్గిపోతుంది. తీవ్ర, తలనొప్పులను లేకుండా చేయడమేకాక మళ్లీ రాకుండా కూడా చేస్తుందట ఈ పరికరం. మామూలు మందులకు స్పందించని శిరోభారాలకూ ఇది సమర్థవంతంగా పనిచేస్తుందట! కండరాలను కదిల్చి నొప్పిన హరిస్తుందని ఈ పరికరాన్ని రూపొందించిన వారు వివరిస్తున్నారు.
No comments:
Post a Comment