Sunday 23 March 2014

' తేనె' లొలుకు ఆరోగ్యం

        గొంతు నొప్పి, జలుబు, పెద్దప్రేగు శోథ, మధుమేహం లాంటి సమస్యలకు విరుగుడు తేనె అని, తేనె ఔషద సుగుణాలను గురించి మన పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాం. ఇప్పుడు బ్యాక్టీరియాను నిరోధించే శక్తి తేనెకు ఉందని తాజా అధ్యయనం తెలుపుతోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్‌ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో ''వివిధ స్ధాయిలలో బ్యాక్టీరియాను నిరోధించే సామర్ధ్యం ఒక్క తేనెకే ఉందని, ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నిరోధించి రోగనిరోధకశక్తిని పెంచుతుందని'' శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ అధ్యయనం ప్రకారం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఆమ్లత్వం, ద్రవాభిసరణ ప్రభావం, అధిక చక్కెర గాఢత, పోలీఫెనాల్స్‌లతో తేనె కలిసినప్పుడు అది ఒక ఆయుధంగా పనిచేసి బ్యాక్టీరియా కణాలను చంపడానికి ఎంతో చురుకుగా పనిచేస్తుందని కనుగొన్నారు. రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియాల తయారీని తేనె నిరోధిస్తుందని మునుపటి అధ్యయనాలు కూడా ధృవీకరించాయి.
తేనెలో ఉండే సాంప్రదాయిక యాంటీ బయోటిక్స్‌ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే క్రమంపై దాడి చేయదు. కాని అది అభివృద్ది చెందిన తర్వాత దానిపై దాడి చేస్తుంది. అందుకే మందులలో కూడా తేనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తేనె ఎంతో బలవర్ధకమైనది. ఇది శరీరానికి రక్షణ కవచంగా పనిచేసి ఆరోగ్యకరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తేనెలో ఫినోలిక్‌ ఆమ్లాలు, కెఫిక్‌ యాసిడ్‌, పి-క్యేమరిక్‌ ఆమ్లం, గాలిక్‌ ఆమ్లం లాంటి అనేక రసాయన కారకాలు కూడా ఉన్నాయి. అనేక ఇతర అధ్యయనాలు కూడా సూక్ష్మక్రిములు లేని పెరాక్సైడ్‌కు, యాంటీ ఆక్సిడెంట్లుగల తేనెకు గల సంబంధాన్ని వివరించాయి.
విస్తృతమైన యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌ , యాంటివైరల్‌ లక్షణాలు తేనెలో ఉన్నాయని అనేక రసాయనిక ప్రయోగాలు కూడా ధ్రువీకరించాయి. అందుకే తేనె సమర్ధవంతమైన బ్యాక్టీరియా నివారిణిగా కనుగొన్నారు.

No comments:

Post a Comment