Monday 1 April 2013

కాఫీ తాగితే... హృద్రోగం మాయం



ప్రొద్దున్నే వేడివేడి కాఫీ తాగందే.. బుర్ర పనిచేయదు. ‘కెఫెన్’ అనే పదార్థం వొంటికి అంత మంచిది కాదనీ..
అదే పనిగా కాఫీ తాగేస్తూంటే -లేనిపోని సమస్యలొస్తాయన్న మాట పక్కనపెట్టి - ప్రతిరోజూ రెండు
మూడు కప్పుల వేడి కాఫీ తాగటంవల్ల మహిళల్లో ‘హృద్రోగం’ ఛాయలు 19 శాతం కనిపించలేదని
యుఎస్ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.  83,076 మంది మహిళలపై జరిపిన పరిశోధనల ద్వారా
 ఈ సంగతి వెల్లడించారు. వీరంతా గతంలోవిపరీతంగా సిగరెట్లు తాగేవారు.. లేదా అస్సలు తాగని
 వారై ఉన్నారు. పొగ పీల్చేవారిలో 3 శాతం.. పీల్చని వారిలో 43 శాతం పురోభివృద్ధి కనిపించినట్టు 
 తెలిపారు. ఏది ఏమైతేనేం - కాఫీ తాగటంవల్ల హృద్రోగాన్ని పారద్రోల వచ్చునన్నమాట.

Courtsey With : Andhra Bhumi Daily

No comments:

Post a Comment