Friday 25 October 2013

జంక్ ఫుడ్టా.. జంకాల్సిందే!
Posted on: Fri 04 Oct 22:37:36.996226 2013















                   ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటి జంక్‌ఫుడ్స్‌ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు.
 జంక్‌ ఫుడ్‌లో ఏముంటాయో చూడండి
ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే ,
అధికంగా కొవ్వు
ఎక్కువ ఉప్పు శాతం
ఎక్కువ చక్కెర శాతం
తక్కువ పీచు పదార్థం
చాలా తక్కువ స్థాయిలో కాల్షియం, ఐరన్‌ లాటి పోషకాలు
ఇలా అలవాటు చేసుకోండి
కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోండి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.
షఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్‌ ముందు కూర్చునో చిప్స్‌ వంటి స్నాక్స్‌ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్‌ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
షఉదయంపూట ఎట్టి పరిస్థితులలో బ్రేక్‌ఫాస్ట్‌ తినకుండా ఉండకూడదు.విటమిన్లు, మినరల్స్‌, ఫైబర్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తింటే జంక్‌ఫుడ్‌ తినాలన్న కోరిక తగ్గుతుంది.
షఇంట్లో వండే సాంప్రదాయ వంటలే కాక పోషక విలువలు కలిగిన మీకు నచ్చిన వంటకాలు తయారుచేసుకుని తినడం వలన కూడా జంక్‌ జోలికి వెళ్ళకుండా ఆపవచ్చు.
ఎప్పుడూ తినే జంక్‌ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ మార్చి, ఆరోగ్యకరమైన ఆహారం దొరికేచోటును ఎంచుకోవడానికి స్నేహితులను ఒప్పించండి.
షఫ్రెండ్స్‌తో టైమ్‌పాస్‌ చేయడానికి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు కాకుండా వేరే అనువైన ప్రదేశాలు ఎంచుకోవడం వల్ల అనవసరంగా జంక్‌ఫుడ్‌ను తీసుకోకుండా ఆపచ్చు.
స్కూల్‌, లేదా క్యాంటీన్‌ నిర్వాహకులతో మాట్లాడి, జంక్‌ ఆహారం బదులు హెల్దీ స్నాక్స్‌ అమ్మేలా చూడాలి,
సూపర్‌మార్కెట్‌ నుండి కొనే సరుకుల్లో ప్రాసెస్డ్‌ఫుడ్‌ ఇంటికి తేకుండా ఉండేలా నియమం పెట్టుకోవాలి.
ఆలోచనా తీరు మారాలి
రోగ్యకరమైన ఆహారం చాలా ఖరీదు ఎక్కువై ఉంటుందనుకుంటాం. అది నిజం కాదు. జంక్‌ ఆహారపు ధరను ఇతర ఆరోగ్యకరమైన ఆహారంతో పోల్చి చూస్తే ఆ విషయం తెలిసిపోతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం రుచి లేకుండా ఉంటుందనుకుంటాం. కానీ పోషక విలువలు కలిగిన ఆహారం కూడా రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం పండ్లు, ఎక్కువ ధర కలిగిన కూరగాయలు మాత్రమే కాదు, తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు వంటి ఎన్నో తక్కువధరకే దొరికే ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు ఉన్నాయి.
తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి
జంక్‌ఫుడ్‌ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోని వారికంటే అధిక బరువు కలిగి ఉండే అవకాశం ఉంది.
జంక్‌ఫుడ్‌ తినడం అలవాటు మొదలైతే ఒక వ్యసనం లాగా పట్టి పీడిస్తుంది. చురుకుదనం తగ్గిపోయి మందకొడితనం ఏర్పడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల వలన ఎదుగుతున్న వయస్సులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్‌ వంటి పోషక పదార్ధాలు అందడంతో జ్ఞాపకశక్తి పెంపొంది, అన్నింటా ముందు నిలుస్తారు.

Courtesy with: PRAJA SEKTHI DAILY

No comments:

Post a Comment