Wednesday 18 July 2012

కళ్ళు నిజం చెప్పవు..!




          మానసిక వేత్తలు కళ్ళు నిజం చెబుతాయని అంటారు. మాట్లాడుతూ కుడివైపుకు కళ్ళు మళ్లిస్తే అబద్ధం చెప్పినట్టూ, ఎడమవైపుకి చూస్తే నిజం చెబుతున్నట్టూ భావిస్తారు. కానీ, ఎడింబర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధనలు అటువంటి కళ్ళ సిద్ధాంతం తప్పని తేల్చాయి. కంటికీ, ఆలోచనలకూ సంబంధం ఉందన్నది న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామింగ్‌లో ఒక భాగం. దీని ప్రకారం కుడి చేయి వాటం గలవాళ్ళు కుడివైపుకి చూస్తే వాళ్ళు చెప్పేది నిజం కాకపోవచ్చు. అదే వాళ్ళు ఎడమవైపు చూస్తే వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారని, కాబట్టి వాళ్ళు చెప్పేది నిజం అనీ అనుకుంటారు. అయితే అనేకరకాల పరీక్షల తరువాత కంటిచూపుకీ, చెప్పే విషయానికీ ఎటువంటి సంబంధమూ లేదని తేలింది. కాబట్టి, కళ్ళు నిజాలూ, అబద్ధాలూ చెప్పలేవు.

No comments:

Post a Comment