Wednesday, 4 July 2012

ఆందోళనకరంగా వాతావరణం..!          ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితి మానవ జీవితాలకు ఇబ్బంది కలిగించే విధంగా మార్పు చెందుతున్నట్టు పరిశోధకులు గ్రహించారు. అంచనాలకు అందని విధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అటు ఉష్ణప్రాంత వాసులనే కాక ఇటు శీతల ప్రాంత వాసులకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. గతవారం కాలిఫోర్నియాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడం ఒక ఉదాహరణంగా చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అడుగంటిపోతున్న భూగర్భజలాలు, కరుగుతున్న అంటార్కిటికా మంచు వంటి ఘటనలు పొంచి వున్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెట్టిన దానికి ఫలితమే ఇది అని అంటున్నారు.

No comments:

Post a Comment