సగం నెల మెలకువలోనే డాల్ఫిన్లు..!
- డాక్టర్ కాకర్లమూడి విజయ్


నిత్యం టీవీ ముందు కూర్చుంటే కళ్ళ నుండి ఒళ్ళు వరకూ ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు తాజాగా టీవీ చూడటం వలన కలిగే మరొక హాని బయటపడింది. ఆస్ట్రేలియా పరిశోధకుల ప్రకారం టీవీ చూసిన ప్రతి గంటలో సుమారు ఇరవై నిమిషాల మేర మన జీవితం హరించుకుపోతుందట! అస్సలు టీవీ చూడని వారికంటే ఎక్కువగా టీవీ చూసేవారిలో ఈ వ్యత్యాసం అధికంగా ఉందని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం నిత్యం టీవీ చూసేవారిలో సగటు జీవితకాలం దాదాపు ఐదేళ్ళు తగ్గుతుందట! ఇందుకు అసలు కారణం టీవీ చూస్తూ మనం కనీసం కాళ్ళు కూడా కదపనంత బద్ధకంగా ఉండటమేనట!

ఇదేదో
మాయా మంత్రం కాదుగానీ, ఒక బ్రిటిష్ కంపెనీ మాత్రం కేవలం గాలి,
విద్యుత్‌ని ఉపయోగించి పెట్రోల్‌ని తయారుచేయవచ్చని చెబుతుంది. వాతావరణంలోని
కార్బన్ డై ఆక్సైడ్‌ని తొలగించడం ద్వారా ఈ తాజా టెక్నాలజీ పనిచేస్తుందట!
సోడియం హైడ్రాక్సైడ్‌ని కార్బన్ డై ఆక్సైడ్‌తో కలిపి ఎలక్ట్రాలిసిస్
ప్రక్రియ ద్వారా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఆ హైడ్రోజన్, కర్బన
వాయువుతో కలిసి మిథనాల్ ఏర్పడుతుంది. దాన్ని గాసోలిన్ ఫ్యూయెల్
రియాక్టర్‌లోకి పంపి కృత్రిమ పెట్రోల్‌ని తయారుచేస్తారు. ఇదంతా అద్భుతంలాగే
అనిపించినా వాస్తవమే. రానున్న రోజుల్లో ఈ విధంగా గాలి ఉపయోగపడనుందండోరు..!

పాల
మీగడ వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని తెలుసు. ఇప్పుడు అదే మీగడ
ప్రాణాంతక హెచ్‌ఐవి బారి నుండి రక్షణ కలిగిస్తుందని పరిశోధకులు గమనించారు.
గర్భంతో వున్న ఆవులకు హెచ్‌ఐవి ప్రొటీన్‌ని ఇంజెక్ట్ చేసి, ఆ ఆవు పిల్లకు
జన్మనిచ్చాక జున్నుపాలను పరీక్షించారు. దానిలో అధికమోతాదులో హెచ్‌ఐవి
వ్యతిరేక యాంటీబాడీలు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ పాల నుండి మీగడను తీసి
హెచ్‌ఐవి సోకకుండా అరికట్టవచ్చని ఆలోచిస్తున్నారు. అయితే మీగడే ఎందుకంటే...
స్త్రీలు సంభోగ సమయంలో ఆ క్రీంని వాడితే కచ్ఛితంగా హెచ్‌ఐవి నుండి రక్షణ
లభిస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఎలుకలకి
ఘ్రాణశక్తి అధికం. గతంలో జరిగిన యుద్ధాలు విషాదంతోబాటు లాండ్‌మైన్‌లనూ
మిగిల్చాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం తలకు మించిన భారం
అవుతోంది. ఇప్పటివరకూ ''హీరో రాట్స్'' అనే భారీ ఎలుకలని ట్రైన్ చేసి
లాండ్ మైన్స్‌ని పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి రెండు గంటల్లో
సుమారు 300 చదరపు మీటర్ల నేలను జల్లెడ పట్టేస్తాయి. అదే పనిని మనుషులు
చేయాలంటే రెండురోజులు పడుతుందట. కానీ ఈ హీరో ఎలుకలు ఆ నైపుణ్యాన్ని
పొందాలంటే తొమ్మిది నెలల శిక్షణ అవసరం. ఇప్పుడు జన్యు మార్పిడి సాంకేతికంతో
కొత్తరకం ఎలుకలని రూపొందించారు. ఇవి విస్ఫోటన పదార్థాలను సమర్థవంతంగా
పసిగడతాయట! ఒకసారి ఇవి పసిగట్టి ఆ లాండ్‌మైన్ ఎక్కడ వుందో చూపెడితే
నిపుణులు వెళ్లి దానిని నిర్వీర్యం చేస్తారు. ఇంకా ఈ జన్యుమార్పిడి ఎలుకలను
క్షేత్రస్థాయి పరీక్షలకి పంపలేదు.
No comments:
Post a Comment