సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు?
- ఎం.ఫాతిమా, మునిసిపల్ కార్పొరేషన్ శ్రీనగర్ బాలికోన్నత పాఠశాల, కాకినాడభూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడనే నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని భూ పరిభ్రమణ వృత్తం (ECLIPTIC)అంటారు. ఈ వృత్తోపరితలానికి సుమారు 23 డిగ్రీల కోణంలో (900 కాకుండా) వంగిన అక్షం చుట్టూ భ్రమిస్తూ భూమి ఈ వృత్తోపరితల పరిధి (ecliptical perifery) లో పరిభ్రమి స్తోంది. భ్రమణాక్షం (spinning axis) భూమికున్న ఉత్తర దక్షిణ దిశల్లో ఉంది. మనం ఈ భూమి నుంచి దూరంగా వెళ్లి సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే ఎక్లిప్టిక్ కక్షను చూస్తు న్నట్లు ఊహించుకొందాం. మనం చూస్తున్నపుడు భూమధ్య రేఖకు పైభాగాన ఉత్తర అమెరికా, రష్యా, గ్రీన్‌లాండ్ భాగాలు మనకు కనిపించేలా మనం నిల్చున్నట్లు భావిద్దాం. అపుడు భూమి తన చుట్టూ తాను మన పరిశీలన ప్రకారం ఎడమ నుంచి కుడివైపునకు భ్రమిస్తున్నట్లు ఉంటుంది. అంటే కుడి భాగం సూర్యుడివైపునకు తిరుగుతున్నట్లు, ఎడమభాగం సూర్యుడివైపు పోవడానికి సిద్ధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. మనం ఆకాశంలో ఎక్లిప్టిక్ వైపు చూస్తున్నపుడు మనకు కుడివైపున సూర్యుడు, ఎడమవైపున భూమి ఉండే విధంగా మన స్థావరాన్ని ఊహించుకోవాలి సుమా!

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
No comments:
Post a Comment