
కండరాలు మళ్ళీ శక్తినీ, బలాన్నీ పుంజుకోవడం ఎలాగో తెలిసిన నేపథ్యంలో శాస్త్రజ్ఞులు యవ్వన గుళికను రూపొందించే దిశలో మరో ముందడుగు వేశారు. లండన్, హార్వార్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కండరాలలోని మూల కణాలపై అధ్యయనం చేస్తూ వయస్సుతోబాటు కండరాలలో పునరుత్పత్తి శక్తి ఎందుకు తగ్గిపోతోంది అన్న విషయంపై పరిశోధిస్తున్నారు. వయస్సుతోబాటు మూలకణాలు కూడా క్షీణించడాన్ని వీరు గమనించారు. అందుకు కారణమైన ఒక ప్రొటీన్‌ను గుర్తించారు. ఆ ప్రొటీన్‌ని గనక నియంత్రించగలిగితే వయస్సు మళ్ళినవారిలో కండరశక్తిని పెంపొందించవచ్చని వీరి అంచనా.
No comments:
Post a Comment