Wednesday 14 March 2012

ఆస్పిరిన్‌... మహా ఔషదం..!

న్యూయార్క్‌లోని పరిశోధకులు చేసిన ప్రయోగం ప్రకారం. అతి సాధారణమైన ఆస్పిరిన్‌ ఏకంగా పదకొండు రకాల కాన్సర్‌లను అడ్డుకోగలదు. కొత్తరకం హైబ్రిడ్‌ ఆస్పిరిన్‌లో రెండు వాయువుల అణువులు ఉంటాయి. ఆ రెండు వాయువులే అద్భుతం చేస్తాయి. ఇప్పటికే తలనొప్పి నుండి గుండెజబ్బుల వరకూ ప్రపంచంలో అత్యంత అధికంగా వాడబడుతున్న ఔషధం ఆస్పిరిన్‌. ఆస్పిరిన్‌ తాలూకు యాంటీ కాన్సర్‌ గుణాలు చాలాకాలం ముందు నుండే తెలిసినా, అవి నిర్దారింపబడలేదు. ఇద్దరు భారతీయులు కూడా ఉన్న పరిశోధక బృందం వెలువరించిన తాజా ఫలితాల ప్రకారం ఇతర మందులతో ఆస్పిరిన్‌ను వాడితే మంచి ఫలితాలను పొందవచ్చట. అయితే, ఆస్పిరిన్‌ వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. కొత్తగా రూపొందించిన ఆస్పిరిన్‌ ఆ దుష్ప్రభావాలను తొలగించి తక్కువ మోతాదునే వాడే వీలు కల్పిస్తుందట.

No comments:

Post a Comment