Monday 9 April 2012

వేసవి కాలం వ్యాధులు


సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. దీంతో శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వివిధ రకాల కీటకాల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా ఆహారం/నీటి వల్ల వచ్చే వ్యాధులు (టైఫాయిడ్‌, కలరా, విరేచనాలు), అమ్మవారు (చికెన్‌ఫాక్స్‌). దోమల నుంచి వచ్చే వ్యాధులు (డెంగ్యు, మలేరియా). చర్మ సంబంధిత వ్యాధులు పొక్కులు దద్దుర్లు వస్తాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, జ్వరం తరచుగా వస్తాయి.
టైఫాయిడ్‌ ఆహారం లేదా నీటిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ చేరినప్పుడు సాల్మొనెల్లటైఫీ అనే సూక్ష్మజీవి ద్వారా వ్యాప్తిచెందుతుంది. ఈ బ్యాక్టీరియా తినే ఆహారం ద్వారా చిన్న పేగుల్లోకి చేరి, జ్వరం (104 డిగ్రీల ఫారెనహీట్‌), విపరీతంగా చెమటలు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి నాలుగు దశల్లో ఉంటుంది. ఒక్కో దశ ఒక్కోవారం ఉంటుంది. వైడాల్‌ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. దీని తర్వాత మలేరియా సర్వసాధారణంగా కనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి మలే రియాలో కనిపి ిస్తాయి. మలేరియా తీవ్రత అధికమైతే కోమాలోకి వెళ్లిపోవడం లేదా చనిపోయే అవకాశాలున్నాయి. జ్వరం, వణుకు, ఒళ్లునొప్పులు, వాంతులు, రక్తహీనత, పచ్చకామెర్లు, మూర్ఛ మలేరియా లక్షణాలు. మొదట చలి, తర్వాత వణుకు, జ్వరం, వెంటనే చెమటలు పట్టడం కనిపిస్తాయి.
ఈ వ్యాధులకు హోమియోపతి వైద్యంలో చికిత్స చేస్తారు. వ్యాధిని మూలకారణం నుంచి తీసేసి రోగినిరోధక వ్యవస్థను పెంచుతూ తత్వం బట్టి మందు ఇచ్చి నివారిస్తారు.
చికిత్సతోపాటు వ్యాధులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...
* పూర్తిగా ఉడకబెట్టిన ఆహారపదార్థాలను తీసుకోవాలి.
* ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి.
* రోజూ సుమారు 6 నుంచి 8 లీటర్ల నీళ్లను తీసుకోవాలి.
* ఎక్కువగా కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలి.
* ఎక్కువగా ఎండలో తిరగకూడదు. కాటన్‌ బట్టలు ధరించాలి.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్‌
పాజిటివ్‌ హోమియోపతి
హైదరాబాద్‌.
ఫోన్‌ : 9290901002

No comments:

Post a Comment